హార్ముజ్ జలసంధిలో క్రాస్‌ఫైర్.. భారతీయ సెయిలర్ మృతి

by Malleboina Mahesh |

హార్ముజ్ జలసంధిలో ఇరాన్-అమెరికా బలగాల మధ్య జరిగిన కాల్పుల్లో భారతీయ సెయిలర్ అల్తాఫ్ తలబ్ కెర్ మరణించారు.

హార్ముజ్ జలసంధిలో క్రాస్‌ఫైర్.. భారతీయ సెయిలర్ మృతి
X

దిశ, వెబ్ డెస్క్: దుబాయ్ నుంచి యెమెన్‌కు కార్గోతో వెళ్తున్న ‘అల్‌ఫైజ్ నూర్ సులేమానీ’ నౌక, హార్ముజ్ జలసంధి వద్ద ఇరాన్, అమెరికా బలగాల మధ్య జరిగిన కాల్పుల మధ్యలో చిక్కుకుంది. ఈ క్రాస్‌ఫైర్‌ (Crossfire)లో భారత్‌కు చెందిన అల్తాఫ్ తలబ్ కెర్ (Altaf Talab Kerr) అనే సెయిలర్ ప్రాణాలు కోల్పోయారు. ఆయన స్వస్థలం, ఇతర వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. కాగా ఈ క్రాస్ ఫైర్ జరిగిన సమయంలో నౌకలో ఉన్న మిగిలిన 17 మంది సిబ్బందిని ‘ప్రేమ్ సాగర్’ అనే నౌక క్షేమంగా రక్షించి దుబాయ్‌కు చేర్చింది. మరణించిన అల్తాఫ్ తలబ్ కెర్ మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు దుబాయ్‌లోని భారత కాన్సులేట్ అధికారులు చర్యలు చేపట్టారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని అధికారులు వెల్లడించారు.

Next Story