అత్యంత పారదర్శకంగా భారత ఎన్నికల నిర్వాహణ: చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్

by Malleboina Mahesh |   (  Updated:2026-05-30 08:45:52  IST  )

భారత ఎన్నికలు రాజ్యాంగం, ఎన్నికల చట్టాల ప్రకారమే జరుగుతాయని సీఈసీ జ్ఞానేష్ కుమార్ వెల్లడి. లోక్‌సభ ఎన్నికల కోసం 1.8 కోట్ల మంది సిబ్బంది పారదర్శకతతో పనిచేస్తున్నారని ప్రశంస.

అత్యంత పారదర్శకంగా భారత ఎన్నికల నిర్వాహణ: చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్
X

దిశ, వెబ్ డెస్క్: భారతదేశంలో ఎన్నికల నిర్వహణ పూర్తిగా రాజ్యాంగం, ఎన్నికల చట్టాలు, కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసే పారదర్శక మార్గదర్శకాలకు లోబడే జరుగుతుందని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ స్పష్టం చేశారు. ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, భారత ఎన్నికల ప్రక్రియ యొక్క పారదర్శకతను, నిష్పక్షపాతత్వాన్ని మరోసారి ఆయన నొక్కి చెప్పారు. లోక్‌సభ ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల సంఘం ఏకంగా 1.8 కోట్ల మంది సిబ్బందిని రంగంలోకి దించుతుందని జ్ఞానేశ్ కుమార్ వెల్లడించారు. ఈ భారీ యంత్రాంగం అంతా అత్యంత పారదర్శకత, జవాబుదారీతనంతో పనిచేస్తూ.. దేశంలో ఉచిత, నిష్పక్షపాత ఎన్నికలు (Free and Fair Elections) జరిగేలా చూస్తారని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ పటిష్టతకు ఈ యంత్రాంగమే వెన్నెముక అని కొనియాడారు.

Next Story