మూడో టీ20లో గ్రాండ్ విక్టరీ.. సిరీస్ కైవసం

by Gantepaka Srikanth |

అస్సాంలోని గౌహతి మైదానం వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది.

మూడో టీ20లో గ్రాండ్ విక్టరీ.. సిరీస్ కైవసం
X

దిశ, వెబ్‌డెస్క్: అస్సాంలోని గౌహతి మైదానం వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. కివీస్ నిర్దేశించిన 154 పరుగులు లక్ష్యాన్ని 10 ఓవర్లు మిగిలి ఉండగానే.. సునాయాసంగా చేధించింది. మరోసారి టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ(68), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(57) హాఫ్ సెంచరీలతో రెచ్చిపోయారు. ఇషాన్ కిషన్ కూడా 28 పరుగులతో పర్వాలేదనిపించారు. మొత్తంగా ఎనిమిది వికెట్ల తేడాతో కివీస్‌పై గెలుపొందారు. ఎక్కడా అవకాశం ఇవ్వకుండా మూడు టీ20ల్లో గెలవడంతో సిరీస్ దక్కింది. ముందుగా టాస్ ఓడి న్యూజిలాండ్ బ్యాటింగ్ చేసింది. భారత్ ముందు 154 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. గ్లెన్ ఫిలిప్స్ 48, మార్క్ చాప్‌మన్ 32 పరుగులు చేశారు. భారత్ తరపున జస్‌ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు పడగొట్టాడు. హార్దిక్ పాండ్యా, రవి బిష్ణోయ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. హర్షిత్ రాణా ఒక వికెట్ తీశారు. ఒక బ్యాట్స్‌మన్ రనౌట్ అయ్యాడు. కివీస్ తరపున మాట్ హెన్రీ ఒక వికెట్, కైల్ జామిసన్ మూడు, రాచిన్ రవీంద్ర నాలుగు, డెవాన్ కాన్వే రెండు, టిమ్ సీఫెర్ట్ 12, మిచెల్ సాంట్నర్ 27, డారిల్ మిచెల్ 14 పరుగులు చేశారు. దీంతో టీమిండియా గెలుపు ఈజీ అయింది.

Next Story