భారత్ ఊచకోత.. రెండో T20లో ఘన విజయం

by Gantepaka Srikanth |   (  Updated:2026-01-23 17:03:05  IST  )

రాయ్‌పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది.

భారత్ ఊచకోత.. రెండో T20లో ఘన విజయం
X

దిశ, వెబ్‌డెస్క్: రాయ్‌పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. కివీస్ నిర్దేశించిన 209 టార్గెట్‌ను కేవలం 15.2 ఓవర్లలోనే ఛేదించింది. భారత ప్లేయర్లు ఇషాన్ కిషన్(76), సూర్యకుమార్ యాదవ్(82*), శివమ్ దూబే(36*) రఫ్పాడించడంతో గెలుపు సునాయాసం అయింది. న్యూజిలాండ్ బౌలర్లలో మాట్ హెన్రీ, జకాబ్ డఫ్పీ, సోధి తలో వికెట్ తీశారు. ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు సమష్టిగా రాణించి భారీ స్కోరు సాధించారు. మిచెల్ శాంట్నర్ (47 నాటౌట్), రచిన్ రవీంద్ర (44) కీలక పరుగులు చేయడంతో న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టాడు.

Next Story