- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐదో టీ20లో టీమిండియా గ్రాండ్ విక్టరీ.. సీరిస్ కైవసం
కేరళలోని తిరువనంతపురం మైదానం వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది.

దిశ, వెబ్‌డెస్క్: కేరళలోని తిరువనంతపురం మైదానం వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. 46 పరుగుల తేడాతో గెలుపొందారు. 04-01తో తేడాతో సిరీస్ కైవసం చేసుకున్నారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. మొత్తం 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయిన టీమిండియా.. న్యూజిలాండ్ ఎదుట 271 పరుగుల భారీ లక్ష్యాన్ని పెట్టింది. భారత బ్యాటర్లలో అభిషేక్ శర్మ 30, ఇషాన్ కిషన్ 103, సూర్యకుమార్ యాదవ్ 63, హార్దిక్ పాండ్యా 42 పరుగులు చేసి సమిష్టిగా రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో ఫెర్గర్‌సన్ రెండు, సాంట్నర్, డఫీ చెరో వికెట్ తీశారు. 271 పరుగుల లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ వచ్చిన కివీస్ కూడా పర్వాలేదనిపించింది. మొదటి నుంచి దూకుడుగా రాణించిన ఫలితం లేకుండా పోయింది. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ ఐదు వికెట్లు, అక్షర్ పటేల్ మూడు వికెట్లు, వరుణ్ చక్రవర్తి ఒక వికెట్ తీశారు. మొత్తంగా 19.4 ఓవర్లలో 220 పరుగులు చేసి ఆలౌట్ అయింది.






