మగ తోడు లేనిదే మహిళలు విమాన ప్రయాణం చేయొద్దు.. తాలిబన్లు

by Disha Web Desk 17 |
మగ తోడు లేనిదే మహిళలు విమాన ప్రయాణం చేయొద్దు.. తాలిబన్లు
X

కాబూల్: ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల చర్యలు రోజురోజుకు శృతి మించుతున్నాయి. ముఖ్యంగా ఆడవారిపై వారి ఆంక్షలు మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. తాజాగా ఒంటరి మహిళలను విమానాల్లోకి ప్రవేశించడానికి అనుమతించబోమని ప్రకటించారు. మగవారు తోడు లేకుండా ఎక్కడం నిషేధమని తెలిపారు. ఈ మేరకు దేశంలోని విమానయాన సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే విషయమై స్పష్టత ఇవ్వకపోగా, ఇప్పటికే పలువురు మహిళలను వెనక్కి పంపించినట్లు నివేదికలు తెలిపాయి. కాగా, దీనిని తాలిబన్లు అధికారికంగా నిర్ధారించకపోయిన, ఇస్లామిక్ చట్టం, ఆఫ్ఘన్ సంస్కృతికి అనుగుణంగా మహిళలకు హక్కులను కల్పిస్తామని తాలిబన్ ప్రతినిధి చెప్పారు. ఇప్పటికే తాలిబన్లు అప్ఘానిస్తాన్ మహిళలపై కఠిన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.


Next Story

Most Viewed