- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుడ్డుతో ఫుట్‌బాల్ ఆడిన కోడి.. అవాక్కైన రొనాల్డో! (వీడియో)
ఈ కోడి ముందు CR7 దిగదుడుపే అంటూ సరదా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. In A Viral Video, Chicken Playing Football With Egg.

దిశ, వెబ్‌డెస్క్ః పోర్చుగల్ జాతీయ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న రొనాల్డో, ప్రీమియర్ లీగ్ క్లబ్ మాంచెస్టర్ యునైటెడ్‌కు ఫార్వర్డ్‌గా ఆడే ఫుట్‌బాల్ ప్లేయర్ అని అందరికీ తెలుసు. అలాంటి, అత్యుత్తమ ఫుట్‌బాల్ ఆటగాళ్ళలో ఒకడైన క్రిస్టియానో రొనాల్డో సైతం అవాక్కైన వీడియో అంటే మామూలుగా ఉండదు కదా..?! రొనాల్డో ఫుట్‌బాల్ స్కిల్స్‌కి ఏమాత్రం తీసిపోకుండా ఈ కోడి కూడా గుడ్డుని ఎలా ఫుట్‌బాల్ ఆడిందో చూడండి? కోడి తన గుడ్డునే ఫుట్‌బాల్‌లా చేసుకొని, పాదాలతో చుట్టి, ప్రో ఫుట్‌బాల్ ఆటగాళ్లలాగా దాని పాదాల పైన డ్రిబ్లింగ్ చేస్తున్నట్లు ఈ వీడియో చూపిస్తుంది. ఇందులో కోడి ఫుట్‌బాల్‌ను బ్యాలెన్స్ చేస్తున్నతీరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కోడి నైపుణ్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేమన్నట్లు ఉంటుంది. కానీ, ఇది నిజం కాదని కూడా ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ నీట్‌గా ఎడిట్ చేసిన ఈ వీడియో ఇంటర్నెట్‌లో నవ్వులు పంచుతుంది. సరదాగా మళ్లీ మళ్లీ చూడాలనిపించేదిగా ఉంది. దీన్ని చూసిన నెటిజన్లు ఈ కోడి ముందు CR7 దిగదుడుపే అంటూ సరదా వ్యాఖ్యానాలు చేస్తున్నారు.






