- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జర్నలిస్టుల అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
తెలంగాణలో జర్నలిస్టుల అక్రమ అరెస్టుల స్పందించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..ఈ అరెస్టులు అప్రజాస్వామికమని అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: మహిళా ఐఏఎస్, మంత్రిపై అసత్యాలను ప్రచారం చేశారని, ఎలాంటి ఆధారాలు లేకుండా కథనాలు ప్రసారం చేసిన కేసులో ఎన్ టీవీ రిపోర్టర్లను ఈ రోజు సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో ప్రతిపక్షాలు, జర్నలిస్టు సంఘాలు పోలీసుల, తెలంగాణ ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందిస్తూ.. తెలంగాణలో జర్నలిస్టుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు అత్యంత అనైతికం, అప్రజాస్వామికమని తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో జర్నలిజం నాలుగో స్తంభం వంటిదని, అలాంటి వ్యవస్థ పై దాడులు చేయడం సరికాదని ఆయన పేర్కొన్నారు. సిట్ (SIT) విచారణ కొనసాగుతున్న తరుణంలో, కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా జర్నలిస్టుల ఇళ్లపై దాడులు చేయడం, తలుపులు పగలగొట్టి మరీ అరెస్టులు చేయడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
విచారణ పూర్తయిన తర్వాత అన్ని అంశాలను పరిశీలించి చర్యలు తీసుకోవాలి తప్ప, ఇలా ముందస్తు అరెస్టులు చేసి భయభ్రాంతులకు గురిచేయడం తగదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అసలు తాము ఏర్పాటు చేసిన సిట్ విచారణపై నమ్మకం లేదా అని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి ప్రశ్నించారు. చట్టం తన పని తాను చేసుకుపోవాలి కానీ, రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం సరికాదని హితవు పలికారు. జర్నలిస్టులను ఉగ్రవాదుల మాదిరిగా అర్ధరాత్రి పూట అరెస్టు చేయడం ద్వారా ప్రభుత్వం ఏం సంకేతాలు ఇవ్వాలనుకుంటోందని ఆయన నిలదీశారు. తక్షణమే అక్రమ అరెస్టులను నిలిపివేసి, మీడియా స్వేచ్ఛను గౌరవించాలని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.






