- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రజలకు మంచి జరుగుతుంటే కాంగ్రెస్‌కు అక్కసు.. కేంద్ర మంత్రి బండి సంజయ్
పథకాల పేర్ల మార్పు, కేంద్ర పథకాల అమలు అంశాలు తెలంగాణలో పొలిటికల్ హీట్‌ను పుట్టిస్తున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: పథకాల పేర్ల మార్పు, కేంద్ర పథకాల అమలు అంశాలు తెలంగాణలో పొలిటికల్ హీట్‌ను పుట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై కాంగ్రెస్ చేస్తున్న రాద్ధాంతంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇవాళ కరీంనగర్‌లోని త్రిధా హోటల్ (Thridha Hotel) ఇవాళ ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు మేలు జరిగే పథకాలపై కాంగ్రెస్ సర్కారుకు ఇంత అక్కసు ఎందుకని ప్రశ్నించారు. గ్రామాల్లో ఇళ్ల నిర్మాణం, రైతులకు సహాయం వంటి అంశాలపై బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారనే కాంగ్రెస్ (Congress) పథకం పేరు మార్చారంటూ మ్యాటర్‌ను డైవర్ట్ చేస్తోందని అన్నారు.
అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ (PMAY-G) కింద గ్రామాల్లో పేదలకు ఇళ్లు నిర్మించే పథకాన్ని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ‘ఇందిరమ్మ ఇండ్లు’ పేరుతో అమలు చేయాలని ప్రయత్నిస్తోందని బండి సంజయ్ ఆరోపించారు. PMAY ఇళ్లను ‘ఇందిరమ్మ ఇండ్లు’గా పేరు మార్చితే కేంద్రం ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయదని హెచ్చరించారు. ఇక గతంలో వాల్మీకీ అంబేద్కర్ ఆవాస్ యోజన(వాంబే) పేరుతో వాజ్ పేయి తెచ్చిన ఇండ్ల నిర్మాణ పథకాన్ని కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎందుకు తీసేసిందో చెప్పాలన్నారు. ఆ పథకానికి ఇందిరా ఆవాస్ యోజన (IAY) మార్చలేదా అని అన్నారు.
హైదరాబాద్ బెగంపేట్ ఎయిర్‌పోర్టు (Begumpet Airport)లోని డొమెస్టిక్ టెర్మినల్‌కు గతంలో ఎన్టీఆర్ పేరు, ఇంటర్నేషనల్ టర్మినల్‌కు రాజీవ్ గాంధీ పేరు ఉండేదన్నారు. ఎయిర్‌పోర్టుకు శంషాబాద్‌కు మారాక ఎన్టీఆర్ పేరు ఎందుకు తొలగించారో సమాధానం చెప్పాలన్నారు. అవన్నీ వదిలేసి ఉపాధి హామీ పథకానికి తాము పేరు మార్చితే నేడు కాంగ్రెస్ పార్టీ గగ్గోలు పెట్టడం హస్యాస్పదంగా ఉందని బండి సంజయ్ అన్నారు.






