- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంచు నదిని చూసారా?
హిమాచల్ ప్రదేశ్‌లో ఈ ఏడాది ఎన్నడూ లేనంతగా విపరీతంగా మంచు కురుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్ : హిమాచల్ ప్రదేశ్‌లో ఈ ఏడాది ఎన్నడూ లేనంతగా విపరీతంగా మంచు కురుస్తోంది. అయితే మంచు ధాటికి చంబా జిల్లాలోని పంగీ వ్యాలీలో ఉన్న మింథాల్ అనే గిరిజన గ్రామంలో మంచు నదిలా ప్రవహిస్తోంది. ప్రస్తుతం ఈ మంచు నది దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోల్లో పెద్ద పెద్ద మంచు ముద్దలు నది నీళ్లలా కిందికి జారుతూ వస్తుండటం కనువిందు చేస్తోంది. రోడ్లు, మైదానాలు, ఇళ్లు అన్నీ పూర్తిగా తెల్లటి మంచు దుప్పటితో కప్పబడ్డాయి. ఈ భారీ హిమపాతంపై స్పందించిన స్థానికులు... చాలా సంవత్సరాల తర్వాత ఇంత ఎక్కువగా మంచు పడిందని, ఇలాంటి దృశ్యాలు చూడటం చాలా అరుదని చెబుతున్నారు.
మంచు కారణంగా ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ లో పరిస్థితి తీవ్రంగా ఉంది. మంచు కారణంగా రోడ్లు పూర్తిగా మూసుకుపోయాయి, గ్రామాలకు వెళ్లే మార్గాలు బంధించబడ్డాయి. ఉష్ణోగ్రతలు -15 నుంచి -20 డిగ్రీల వరకు పడిపోయాయి. దీంతో విద్యుత్ సరఫరా, తాగునీటి సమస్యలు తలెత్తాయి, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా అధికారులు సహాయక చర్యలు అందించేందుకు రంగంలోకి దిగారు.






