ఆటగాళ్లు క్షేమం : ICC కీలక ప్రకటన

by Muthe.Rajitha |

దుబాయ్ మీద ఇరాన్ మిసైల్ దాడులు జరుపుతున్న నేపథ్యంలో T20 WC క్రికెటర్స్ అంతా క్షేమంగానే ఉన్నారని ICC ప్రకటించింది.

ఆటగాళ్లు క్షేమం : ICC కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్ : మధ్యప్రాచ్యంలో మొదలైన తీవ్ర ఉద్రిక్తతలతో ఇరాన్ vs అమెరికా, ఇజ్రాయెల్ ల మధ్య యుద్ధం మొదలైంది. ఈ క్రమంలో శనివారం ఇరాన్ దుబాయ్ వంటి నగరాలపై క్షిపణి దాడులకు దిగింది. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే ఈ తీవ్ర పరిణామాలపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఎమెర్జెన్సీ మీటింగ్ ఏర్పాటు చేసి.. , టోర్నమెంట్‌లో పాల్గొంటున్న ప్రతి క్రికెటర్ ఇప్పటివరకు క్షేమంగా ఉన్నారని అధికారికంగా ప్రకటించింది. వారితోపాటు సహాయక సిబ్బంది, మ్యాచ్‌లు చూడటానికి వచ్చిన వేలాది మంది అభిమానులు సేఫ్ గానే ఉన్నారని పేర్కొంది. ఐసీసీ తన భద్రతా బృందాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ, క్రీడాకారులు బస చేసిన హోటళ్లు, స్టేడియాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది.

పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, క్రీడాకారుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉంటే తక్షణమే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటామని ఐసీసీ తెలిపింది. విమానాశ్రయాల మూసివేత, గగనతలంలో క్షిపణి దాడుల నేపథ్యంలో, కొన్ని జట్ల ప్రయాణ ప్రణాళికల్లో మార్పులు ఉండవచ్చు కానీ, ప్రస్తుతానికి అందరూ సురక్షిత ప్రాంతాల్లోనే ఉన్నారని స్పష్టం చేసింది. అభిమానులు ఆందోళన చెందవద్దని, స్థానిక ప్రభుత్వాల సూచనలను పాటించాలని ఐసీసీ కోరింది.

Next Story