- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైడ్రా ప్రజావాణికి విరామం
ప్రజావాణికి 4 వారాల పాటు విరామాన్ని హైడ్రా కమిషనర్ ఏవీ.రంగనాథ్ ప్రకటించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రజావాణికి 4 వారాల పాటు విరామాన్ని హైడ్రా కమిషనర్ ఏవీ.రంగనాథ్ ప్రకటించారు. వేలాదిగా వచ్చిన ఫిర్యాదులను ప్రాధాన్య క్రమంలో పరిష్కరిస్తున్నామని.. మిగిలి ఉన్నవి కూడా క్లియర్ చేసేందుకే 4 వారాలు విరామాన్నిచ్చినట్టు బుధవారం హైడ్రా కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 8వ తేదీ నుంచి యథావిధిగా హైడ్రా ప్రజావాణి కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రజావాణితో పాటు.. వివిధ రూపాల్లో వచ్చిన ఫిర్యాదులన్నీ క్లియర్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ విరామన్ని ప్రకటించినట్టు తెలిపారు. అయితే గతంలో ఇచ్చిన ఫిర్యాదుదారులు అత్యవసరమని భావిస్తే కార్యాలయానికి వచ్చి నేరుగా కలవచ్చన్నారు. అలాగే ముఖ్యమైన సమస్యలున్నా నేరుగా కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు.
30వేల ఫిర్యాదులు..
హైడ్రా ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 30వేల ఫిర్యాదులు వచ్చాయని రంగనాథ్ వెల్లడించిన విషయం తెలిసిందే. వీటిలో ఎక్కువగా చెరువుల కబ్జాలు, రోడ్ల ఆక్రమణలు, లేఅవుట్లలో రోడ్ల మూసివేత వంటి సమస్యలే ఉన్నాయి. ప్రజా ఫిర్యాదులను పరిష్కరించడంతోపాటు ఇప్పటికే హైడ్రా రూ.80వేల కోట్ల విలువైన భూములను కాపాడినట్టు రంగనాత్ తెలిపారు.






