- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్ మెట్రో టేకోవర్ ప్రక్రియ వేగవంతం.. మార్చి 31లోగా స్వాధీనం!
హైదరాబాద్ మెట్రో రైల్ టేకోవర్ ప్రక్రియను ఈ ఆర్థిక సంవత్సరాంతానికి పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ మెట్రో రైల్ టేకోవర్ ప్రక్రియను ఈ ఆర్థిక సంవత్సరాంతానికి పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మెట్రో స్వాధీనం కోసం ప్రభుత్వం టెక్నికల్ కన్సల్టెంట్‌గా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC)ని నియమించింది. ఇప్పటికే ఫైనాన్స్, లీగల్ అడ్వైజర్‌గా ఐడీబీఐ (IDBI) సంస్థను నియమించగా, ఆ సంస్థ తన నివేదికను రూపొందించి ప్రభుత్వానికి అందజేసింది.
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టును ఎల్ అండ్ టీ (L&T) సంస్థ నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రక్రియను ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది. ఫైనాన్స్, లీగల్ అంశాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఐడీబీఐ సంస్థను నియమించారు. ఎల్ అండ్ టీ సంస్థకు ప్రభుత్వం నుంచి అందాల్సిన బకాయిలు, ఇతర ఆర్థిక అంశాలకు సంబంధించిన నివేదికను ఐడీబీఐ ఇప్పటికే అధికారులకు సమర్పించింది. దీని ఆధారంగానే హెచ్‌ఎంఆర్‌ఎల్ (HMRL), ఎల్ అండ్ టీ సంస్థలు చర్చించుకుని ఒప్పందాలపై సంతకాలు చేసే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు.
సాంకేతిక సలహాదారుగా డీఎంఆర్సీ
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్నది. ప్రాజెక్టు ప్రారంభం నుండి పూర్తయ్యే వరకు ఎంతో మంది నిపుణులు ఇందులో పనిచేశారు. ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణ, ఆపరేషన్స్ వంటి అంశాలపై సమగ్ర నివేదిక రూపొందించడానికి ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్‌ను కన్సల్టెంట్‌గా ఎంపిక చేశారు. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను ప్రభుత్వం త్వరలోనే జారీ చేయనుంది. ఫైనాన్స్, లీగల్ మరియు టెక్నికల్ కన్సల్టెంట్లు ఇచ్చే నివేదికల ఆధారంగా మార్చి 31లోగా మెట్రో రైల్ ప్రాజెక్టును పూర్తిస్థాయిలో స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.






