- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దారుణం.. కాపురానికి రావడంలేదని భార్యను చంపిన భర్త
దిశ, వెబ్ డెస్క్: తన భార్య కాపురానికి రావడంలేదని ఓ భర్త దారుణానికి..husband kills his wife and self by detonating bomb

దిశ, వెబ్ డెస్క్: తన భార్య కాపురానికి రావడంలేదని ఓ భర్త దారుణానికి పాల్పడ్డాడు. పుట్టింటికి వెళ్లి నెల రోజులవుతున్నా తిరిగి రావడంలేదని చేపలు పట్టేందుకు వాడే పేలుడు పదార్థాలతో చంపేశాడు. ఈ సంఘటనలో అతను కూడా మృతిచెందాడు. ఈ సంఘటన గుజరాత్ లో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్ లోని ఆరవల్లి జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి అహ్మదాబాద్ కు చెందిన యువతితో వివాహమైంది. అయితే, కొద్దిరోజులపాటు మంచిగానే ఉన్న అతను రోజూ తాగొచ్చి భార్యను వేధించసాగాడు. దీంతో విసుగుచెందిన భార్య తన పుట్టింటికి వెళ్లిపోయింది. నెలరోజులు అవుతున్నా రాకపోడవడంతో ఆగ్రహంతో అత్తగారింటికి వెళ్లాడు. అక్కడికి వెళ్లి తనతో రావాలని భార్యను కోరాడు. అతనితో వచ్చేందుకు ఆమె నిరాకరించింది. అనంతరం అతను పరిగెత్తి ఆమెను హగ్ చేసుకున్నాడు. అయితే, అప్పటికే ప్లాన్ ప్రకారం తన శరీరంపై చేపలు పట్టేందుకు వాడే పేలుడు పదార్థాలను అమర్చుకున్న చోట చేయి పెట్టి రుద్దాడు. దీంతో అవి పేలి భార్యాభర్తలిద్దరూ మృతిచెందారు. భారీ శబ్ధం వచ్చి వారి మృతదేహాలు చెల్లాచెదురుగా పడడంతో స్థానికులు ఉరుకొచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.






