- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, రామాయంపేట: నిజాంపేట మండలం నస్కల్ గ్రామానికి చెందిన భార్య భర్తలు సోమవారం కామారెడ్డి జిల్లా దోమకొండ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. నస్కల్ గ్రామానికి రమేష్, సరోజ భార్యభర్తలు దోమకొండలో జరిగే శుభకార్యానికి బైక్ పై వెళ్లారు. వారు బైక్ పై దోమకొండ శివారులోకి రాగానే వ్యాన్‌ను ఓవర్ టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న డీసీఎం ను ఢీకొట్టారు. ఈ ఘటనలో భార్య భర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. శుభకార్యానికి వెళ్లిన భార్య భర్తలు దుర్మరణం పాలవడంతో నస్కల్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.
Next Story






