- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డెమోక్రాట్ రాష్ట్రాల్లో భారీ కుంభకోణాలు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సారి డెమోక్రాట్ రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకున్న ట్రంప్.. ఎక్స్ వేదికగా ట్వీట్ చేస్తూ.. డెమోక్రాట్ రాష్ట్రాల్లో భారీ కుంభకోణాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

దిశ, వెబ్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సారి డెమోక్రాట్ రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకున్న ట్రంప్.. ఎక్స్ వేదికగా ట్వీట్ చేస్తూ.. డెమోక్రాట్ రాష్ట్రాల్లో భారీ కుంభకోణాలు జరుగుతున్నాయని ఆరోపించారు. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని మినియాపాలిస్‌లో ట్రంప్ ప్రభుత్వం చేపట్టిన 'ఆపరేషన్ మెట్రో సర్జ్' (Operation Metro Surge) లో భాగంగా శనివారం ఉదయం నికోలెట్ అవెన్యూ వద్ద తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.
ఈ క్రమంలో ఫెడరల్ ఏజెంట్లు జరిపిన కాల్పుల్లో 37 ఏళ్ల అలెక్స్ జెఫ్రీ ప్రెట్టి (Alex Jeffrey Pretti) అనే ICU నర్సు మరణించారు. ఏజెంట్లు అతనిని కిందకు నెట్టి, కొట్టిన తర్వాత కాల్పులు జరిపినట్లు కొన్ని వీడియోలు చూపిస్తుండగా, అతను తుపాకీతో తమపైకి వచ్చాడని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం వాదిస్తోంది. ఈ ఘటనతో ఆగ్రహించిన వందలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనలు చేపట్టగా, వారిని అడ్డుకోవడానికి బలగాలు టియర్ గ్యాస్ ప్రయోగించడంతో నగరం రణరంగంగా మారింది.
ఈ దారుణ ఘటనపై మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్ తీవ్రంగా స్పందిస్తూ, ఫెడరల్ ఏజెంట్ల చర్యలను "వికృతమైనవి" గా అభివర్ణించారు. వెంటనే ఆ వేలమంది బలగాలను రాష్ట్రం నుండి వెనక్కి పిలవాలని వైట్ హౌస్‌ను డిమాండ్ చేశారు. మరోవైపు.. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ మిన్నెసోటాను అవినీతికి నిలయంగా అభివర్ణించారు. అక్కడ అవినీతి రాజకీయ నాయకులు, మోసగాళ్లు కలిసి సుమారు 100 బిలియన్ డాలర్లకు పైగా ప్రజాధనాన్ని దోచుకున్నారని, ముఖ్యంగా కాలిఫోర్నియా వంటి డెమోక్రాట్ పాలిత రాష్ట్రాల్లో ఈ దోపిడీ ఇంకా ఎక్కువగా ఉందని సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య ఈ ఘర్షణ వాతావరణం ప్రస్తుతం అమెరికా రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.






