'ఫైటర్' రిలీజ్ వాయిదా.. తీవ్ర నిరాశలో ఫ్యాన్స్..

by Dishafeatures2 |
ఫైటర్ రిలీజ్ వాయిదా.. తీవ్ర నిరాశలో ఫ్యాన్స్..
X

దిశ, వెబ్‌డెస్క్: రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా పూరి తెరకెక్కిస్తున్న 'లైగర్' మూవీ ముందుగా 'ఫైటర్' పేరుతో ప్రచారం జరిగింది. కానీ బాలీవుడు స్టార్ నిర్మాణ ఇదే పేరుతో సినిమాను ఓకే చేశాడు. బాలీవుడ్ యాక్షన్ హీరో హృతిక్ హీరోగా, దీపికా హీరోయిన్‌గా భారీ అంచనాలతో 'ఫైటర్' తెరకెక్కుతోంది. ఈ మూవీలో యాక్షన్ ఎలిమెంట్స్, రొమాన్స్ ఎలిమెంట్స్‌కు ఏ మాత్రం కొదవ లేదని, పక్కా విజువల్ వండర్‌గా ఉండటం పక్కా అని మేకర్స్ అంటున్నారు. ఈ మూవీ 2023 జనవరి 26న విడుదల కానున్నట్లు అనౌన్స్ చేశారు. దీంతో అభిమానులు సంబరాలు చేసుకున్నారు. అయితే తాజాగా హృతిక్ అభిమానులను 'ఫైటర్' మేకర్స్ తీవ్ర నిరాశకు గురిచేశారు. ఈ మూవీ రిలీజ్ డేట్‌ను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఈ సినిమా సరికొత్త విడుదల తేదీని ప్రకటించించారు. ఈ సినిమా 2023 సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ చెప్పారు. అయితే ఈ సినిమాలో సీనియర్ నటుడు అనిల్ కపూర్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. మరి ఈ సినిమాతో హృతిక్ మరోసారి యాక్షన్ హీరోగా హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.

Next Story

Most Viewed