- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, ఫీచర్స్: బద్దకోణాసనం వేసేందుకు ముందుగా నేలపై కూర్చుని వెన్నెముక నిటారుగా ఉండేలా చూసుకోవాలి. కాళ్లను చాచి, ఆ తర్వాత మోకాళ్ల వద్ద కాస్త మడిచి, రెండు అరికాళ్లు ఒకదానికొకటి తాకేలా ఉంచాలి. ఇప్పుడు చేతి వేళ్లను ఒకదానికొకటి జాయింట్ చేసినట్లుగా ఉంచుకుని, కలిపిన రెండు పాదాలను పట్టుకుని దగ్గరకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించాలి. ఈ సమయంలో మీ మోకాళ్లు నేలకు దగ్గరగా ఉండేలా జాగ్రత్తపడుతూ.. నెమ్మదిగా శ్వాసతీసుకుంటూ వదిలేయాలి. అలా కొద్దిసేపు ఈ ఆసనంలో ఉండాలి.
ఉపయోగాలు:
* నెలసరి సమస్యలు తగ్గిపోతాయి.
* పురుషుల్లో హెర్నియా సమస్య రాకుండా చేయగలదు.
* మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
* గర్భిణులకు సుఖప్రసవం అవుతుంది.
Next Story






