సమ్మర్‌లో గుండె జబ్బులున్నవారు రోజుకు ఎన్ని లీటర్ల వాటర్ తాగాలి..?

by Kodari Anjali |

ప్రస్తుత రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మంది గుండెపోటు (heart attack) బారిన పడుతున్నారు.

సమ్మర్‌లో గుండె జబ్బులున్నవారు రోజుకు ఎన్ని లీటర్ల వాటర్ తాగాలి..?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మంది గుండెపోటు (heart attack) బారిన పడుతున్నారు. పెళ్లి భరత్‌లో డ్యాన్సులు వేయడం వల్ల, రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ సడన్‌గా హార్ట్ ఎటాక్ బారిన పడిన ఘటనలు కూడా అనేకం చూస్తున్నాం. దీనికి కారణం అధిక బరువు, అధిక రక్తపోటు (high blood pressure), మధుమేహం (diabetes), శారీరక శ్రమ లేకపోవడం, వ్యాయామాలు (Exercises) చేయకపోవడమని నిపుణులు చెబుతుంటారు.

అలాగే కొలెస్ట్రాల్ (Cholesterol) కలిగిన ఫలకాలు కారణంగా కరోనరీ ధమనులు అడ్డంకులు ఏర్పడటం వల్ల ఒత్తిడి కారణంగా కర్ణిక దడ(Atrial fibrillation) వంటి ప్రాబ్లమ్స్, ఎంబోలిజం కారణంగా గుండెకు చేరే రక్త ప్రసరణ(blood circulation)కు అడ్డంకులు రావడం, అలాగే అతిగా మద్యం సేవించడం, సిగరెట్ కాల్చడం వంటివి కూడా గుండెపోటుకు కారణమవుతాయని నిపుణులు వెల్లడిస్తుంటారు.

వీటితో పాటుగా మైదాతో చేసిన పదార్థాలను అధికంగా తీసుకోవడం వల్ల, అధిక కొవ్వు పదార్థాలు (High fat content) తినడం వల్ల కూడా గుండెపోటు వచ్చినప్పుడు గుండెకు రక్తం అనేది ఆగిపోతుంది. తద్వారా సడెన్‌గా హార్ట్ ఎటాక్ వచ్చిన వెంటనే మరణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు తరచూ చెబుతుంటారు. ః

అయితే వేసవిలో హార్ట్ పెషేంట్స్ ఎన్ని లీటర్ల వాటర్ తాగాలో తాజాగా నిపుణులు వెల్లడించారు. సాధారణంగా సమ్మర్‌లో ఎక్కువగా దాహం వేస్తుందన్న విషయం తెలిసిందే. వాటర్ తగిన మోతాదులో తీసుకుంటే కీళ్ల ఆరోగ్యం బాగుంటుంది. చర్మాన్ని మాయిశ్చరైజ్ (Moisturize) చేస్తాయి. అలాగే అవయవాల ఆరోగ్యం, పేగుల పనితీరును మెరుగుపరుస్తుంది. శరీర ఉష్ణోగ్రతను కాపాడుతుంది. యూరిన్ ద్వారా చెడు పదార్థాల్ని బయటకు పంపుతుంది.

కాగా ఒక వ్యక్తి రోజుకు నాలుగైదు లీటర్ల వాటర్ తాగాలని నిపుణులు చెబుతుంటారు. మరీ హార్ట్ పేషెంట్స్ సమ్మర్‌లో రోజుకు 8 గ్లాసుల వాటర్ లేదా రెండు లీటర్ల నీరు తాగాలి. హార్ట్ పేషెంట్లు అతిగా వాటర్ తాగితే.. హార్ట్ పై ఒత్తిడి పడుతుందని, ముఖ్యంగా ధమనులు వీక్ అవుతాయని అంటున్నారు. హార్ట్ రేట్ కూడా పెరుగుతుంది. వీటితో పాటుగా చెస్ట్ పెయిన్, పక్షవాతం వంటి డేంజరస్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కిడ్నీలపై ఎఫెక్ట్ పడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన సం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.

Next Story