- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విశాఖలో ఘోరం.. చిన్నారిపై 10 కుక్కల దాడి చేసి చెవి కొరికేసిన వైనం
విశాఖ గాజువాకలో ఆడుకుంటున్న బాలుడిపై 10 వీధి కుక్కలు దాడి చేసి చెవి కొరికేశాయి. బాలుడు ప్రస్తుతం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లోని విశాఖలో ఘోర సంఘటన చోటు చేసుకుంది. గాజువాక పరిధిలో వీధి కుక్కల దాడి (Stray Dogs Attack)లో ఒక చిన్నారి తీవ్రంగా గాయపడిన ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలు రేకెత్తించింది. కూర్మాన్నపాలెం వుడా (VUDA) ఫేజ్-2 పార్కులో మోక్షరాజు అనే బాలుడు తోటి పిల్లలతో కలిసి సరదాగా ఆడుకుంటుండగా, ఒక్కసారిగా పదికి పైగా వీధి కుక్కల గుంపు బాలుడిపై విరుచుకు పడ్డాయి. ఆ కుక్కలు బాలుడిని చుట్టుముట్టి విచక్షణారహితంగా కరవడమే కాకుండా, బాలుడి చెవిలోని కొంత భాగాన్ని కొరికేసాయి.
ఆ సమయంలో చిన్నారి భయంతో పెద్దగా కేకలు వేయడంతో గమనించిన స్థానికులు, తల్లిదండ్రులు హుటాహుటిన అక్కడికి పరుగున వచ్చి కుక్కలను బెదరగొట్టి బాలుడిని కాపాడారు. తీవ్ర రక్తస్రావంతో స్పృహ తప్పిన మోక్షరాజును వెంటనే విశాఖపట్నంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడికి అత్యవసర విభాగంలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. నగరంలోని పార్కులు, నివాస ప్రాంతాల్లో వీధి కుక్కల బెడద తీవ్రస్థాయికి చేరిందని, అధికారులు తక్షణమే స్పందించి నివారణ చర్యలు చేపట్టాలని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.






