- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆస్కార్ బరి నుంచి "హోంబౌండ్" ఔట్
భారత్ నుంచి ఆస్కార్ కు వెళ్లిన 'హోంబౌండ్' చిత్రం పోటీ నుంచి ఎలిమినేట్ అయింది.

దిశ, వెబ్ డెస్క్ : భారత్ నుంచి ఆస్కార్ కు వెళ్లిన 'హోంబౌండ్' చిత్రం పోటీ నుంచి ఎలిమినేట్ అయింది. 98వ ఆస్కార్ అవార్డ్స్ 2026లో ఉత్తమ అంతర్జాతీయ చిత్ర విభాగానికి భారత్ తరఫున అధికారిక ఎంట్రీగా వెళ్లిన 'హోమ్‌బౌండ్' చిత్రం చిట్టచివరి దశకు ఎంపిక కాలేదు. నీరజ్ ఘైవాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 2025లో టాప్–15 షార్ట్‌లిస్ట్‌లో చోటు దక్కించుకున్నప్పటికీ.. తుది టాప్–5 జాబితాలో పేరు లేకపోవడంతో ఆస్కార్ బరిలో నుంచి ఔట్ అయింది.
ఇషాన్ ఖట్టర్, జాన్వీ కపూర్, విశాల్ జెత్వా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఉత్తర భారతదేశానికి చెందిన ఇద్దరు స్నేహితుల జీవిత కథ ఇది. కులం, మతం, కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంశలు దక్కించుకుంది. అయితే ఈ ఏడాది ఆస్కార్ పోటీ తీవ్రంగా ఉండటంతో ఫ్రాన్స్, జర్మనీ, డెన్మార్క్ వంటి దేశాల బలమైన చిత్రాలు ముందుకు వెళ్లాయి. ఆస్కార్ బరి నుంచి ఔట్ అయినప్పటికీ.. ప్రజల కథలను చెప్పడం కొనసాగిస్తామని దర్శకుడు నీరజ్ ఘైవాన్ తెలిపారు.
కాగా ఆస్కార్ బరిలోకి వెళ్లిన టాప్ 5 నామినీలు ది సీక్రెట్ ఏజెంట్ (బ్రెజిల్), ఇట్ వాస్ అన్ ఆక్సిడెంట్(ఫ్రాన్స్), సెంటిమెంటల్ వాల్యూ(నార్వే), సిరత్(స్పెయిన్), ది వాయిస్ ఆఫ్ హింద్ రజబ్(టునీషియా) ఆస్కార్ అంతర్జాతీయ చిత్ర విభాగంలో చోటు సంపాదించాయి.






