- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Hombalefilms :హోంబలే ఫిలిమ్స్ బిగ్గెస్ట్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న మోషన్ పోస్టర్ వీడియో
కాంతార, కేజీఎఫ్, సలార్ వంటి బ్లాక్ బస్టర్ అందించిన హోంబలే ఫిలిమ్స్ (Hombalefilms).. ఇటీవల పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)తో ఒకేసారి మూడు ప్రాజెక్టులు అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.

దిశ, సినిమా: కాంతార, కేజీఎఫ్, సలార్ వంటి బ్లాక్ బస్టర్ అందించిన హోంబలే ఫిలిమ్స్ (Hombalefilms).. ఇటీవల పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)తో ఒకేసారి మూడు ప్రాజెక్టులు అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అంతే కాకుండా సలార్-2తో ప్రయాణం స్టార్ట్ చేయ్యబోతున్నట్లు తెలిపింది. ఇదిలా ఉంటే.. తాజాగా మరో సరికొత్త ప్రాజెక్టును పట్టాలెక్కించింది. ఈ మేరకు ‘విశ్వాసం సవాలు చేయబడినప్పుడు అతను కనిపిస్తాడు. చీకటి అలాగే గందరగోళంతో నలిగిపోయిన ప్రపంచంలో... లెజెండ్ యొక్క స్వరూపం, సగం మనిషి, సగం సింహం అవతార్-విష్ణువు యొక్క అత్యంత శక్తివంతమైన అవతారం. మంచి అండ్ చెడుల మధ్య జరిగే పురాణ యుద్ధాన్ని 3Dలో అనుభవించడానికి సిద్ధంగా ఉండండి. త్వరలో మీకు సమీపంలోని థియేటర్‌లలోకి రాబోతోంది! #మహావతార్ నరసింహ (Mahavatar Narsimha) అనేది #మహావతార్ సిరీస్‌లోని మొదటి కథ’ అనే క్యాప్షన్ ఇచ్చి మోషన్ పోస్టర్ వీడియో (Motion Poster Video)ను వదిలారు.
ఇందులో నరసింహ స్వామి అత్యంత అద్భుతంగా కనిపిస్తుండగా.. ‘ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ లోడింగ్’ ‘గూస్ బంప్స్ వస్తున్నాయి’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. కాగా.. హోంబలే ఫిలిమ్స్ అనౌన్స్ చేసిన ఈ బిగ్గెస్ట్ ‘మహావతార్: నరసింహ’ ప్రాజెక్ట్‌ను అశ్విన్ కుమార్ (Ashwin Kumar) తెరకెక్కిస్తుండగా.. శిల్పా ధావన్ (Shilpa Dhawan), కుశాల్ దేశాయ్ (Kushal Desai), చైతన్య దేశాయ్ (Chaitanya Desai)లు నిర్మిస్తున్నారు. కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రానున్న ఈ ‘మహావతార్: నరసింహ’ సినిమా ఇతర అవతారాలలో కూడా రాబోతున్నట్లు చెప్పకనే చెప్పింది హోంబలే ఫిలిమ్స్. నటీనటుల ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను తర్వలోనే ప్రకటించనున్నారు.






