- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎల్ఆర్ఎస్ తో హెచ్ఎండీఏకు రూ.261 కోట్ల ఆదాయం
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది.

దిశ,తెలంగాణ బ్యూరో : ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే ఈనెల 1వ తేదీ నుంచి 31 జులై వరకు ఫీజు చెల్లించినవారికి 25 శాతం రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ పరిధిలోని ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. మూడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో అయితే ప్రత్యేకంగా హెల్ఫ్ డెస్క్‌లను సైతం ఏర్పాటు చేశారు. హెచ్ఎండీఏ పరిధిలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. హెచ్ఎండీఏ పరిధిలో ఇప్పటి వరకు 85,954 దరఖాస్తుదారులు ఫీజు చెల్లించడంతో రూ.261కోట్ల ఆదాయం వచ్చిందని అధికారులు చెబుతున్నారు.
33,096 దరఖాస్తులకు ఆమోదం
హెచ్ఎండీఏ పరిధిలో మొత్తం దరఖాస్తులు 2,90,369 ఉన్నాయి. వీటిలో 2,01,453 అప్లికేషన్లకు ఫీజు ఇంటిమేషన్ ఇచ్చారు. ఆయా కారణాల రీత్యా మరో 54,021 దరఖాస్తులకు ఫీజ్ ఇంటిమేషన్ ఇవ్వలేదు. ఫీజు ఇంటిమేషన్ ఇచ్చినవారిలో 85,954 దరఖాస్తుదారులు ఫీజు చెల్లించారు. దీంతో రూ.261.72 కోట్ల ఆదాయం వచ్చింది. 1.50 లక్షల మంది ఇంకా ఫీజు చెల్లించలేదు. ఫీజు చెల్లించిన 33,096 దరఖాస్తులకు మాత్రమే హెచ్ఎండీఏ అధికారులు ఆమోదించారు. 1,850 అప్లికేషన్లను తిరస్కరించారు. మరో 34,183 అప్లికేషన్స్ ఇంకా సంబంధిత వ్యక్తుల వద్దనే పెండింగ్‌లో ఉన్నాయి. మిగిలిన 30,656 దరఖాస్తులు అధికారుల వద్ద పరిశీలనలో ఉన్నాయి.






