Hijab Controversy: హైదరాబాద్‌లోని స్కూల్‌లో హిజాబ్ వివాదం!

by Nagaya |
Hijab Controversy: హైదరాబాద్‌లోని స్కూల్‌లో హిజాబ్ వివాదం!
X

దిశ, డైనమిక్ బ్యూరో : దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన హిజాబ్ వివాదం ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతుంది అనుకున్న సమయంలో హైదరాబాద్‌లో అదే వివాదం చర్చనీయాంశంగా మారింది. నగరంలోని బహదూర్‌పురా కిషన్‌బాగ్‌లోని గౌతమ్ స్కూల్‌లో హిజాబ్ వివాదం కారణంగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. స్కూల్ ప్రాంగణంలో హిజాబ్, బుర్ఖా ఉపయోగించొద్దని యాజమాన్యం విద్యార్థులకు ఆదేశాలు జారీ చేయగా.. దీనిపై నిరసన వ్యక్తం చేస్తూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి తల్లిదండ్రులకు నచ్చ జెప్పే ప్రయత్నం చేసినప్పటికీ.. వినకుండా మరింత గొడవకు దిగడంతో లాఠీ ఛార్జ్ చేసి అక్కడి నుంచి పంపించేశారు. అయితే, దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.



Next Story