- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో రోజురోజుకూ ఎండల తీవ్రత పెరుగుతోంది. ఏప్రిల్ నెలలోనే ఎండలు మండుతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుండి 5 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండల తీవ్రత భయంకరంగా ఉంది. పెద్దపల్లి జిల్లాలోని అకెనపల్లిలో శుక్రవారం నాడు ఏకంగా 44.3°C అత్యధిక ఉష్ణోగ్రతగా నమోదైంది. దీనికి తోడు జగిత్యాల జిల్లా అల్లీపూర్‌లో 44.1°C, కరీంనగర్ జిల్లా వెదురుగట్టులో 43.8°C ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. రాజధాని హైదరాబాద్‌లో కూడా 41.2°C నుంచి 42.1°C వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో నగరవాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కాగా భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరికల ప్రకారం, ఏప్రిల్ 28 వరకు తెలంగాణలో తీవ్రమైన హీట్ వేవ్ కొనసాగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఇప్పటికే 'ఎల్లో అలర్ట్' జారీ చేశారు. వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉండటంతో మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.






