పాతబస్తీ మెట్రో ఒప్పందాలపై నిర్మాణ సంస్థకు హైకోర్టు ఆదేశాలు

by Muthe.Rajitha |

వారసత్వ కట్టడాల సంరక్షణ కమిటీ ఏర్పాటు అంశం పై వివరణ ఇవ్వాలి

పాతబస్తీ మెట్రో ఒప్పందాలపై నిర్మాణ సంస్థకు హైకోర్టు ఆదేశాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : పాతబస్తీలో మెట్రో నిర్మాణం వల్ల చారిత్రక కట్టడాలు దెబ్బతింటున్నాయని యాక్ట్ స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సీజే ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. మెట్రో నిర్మాణానికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కుదిరిన ఒప్పందాల వివరాలను మూడు వారాల్లో అఫిడవిట్ రూపంలో దాఖలు చేయాలని మెట్రో నిర్మాణ సంస్థను హైకోర్టు ఆదేశించింది. వారసత్వ కట్టడాల సంరక్షణ కమిటీ ఏర్పాటు అంశాన్ని కూడా అఫిడవిట్‌లో పేర్కోనాలని సూచించింది. మెట్రో సంస్థ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి, కేవలం మూడు పురాతన కట్టడాలు మాత్రమే ప్రభావితమవుతాయని వివరించారు. వారసత్వ కట్టడాల సంరక్షణ కమిటీ ఇప్పటివరకు ఏర్పాటు కాలేదని పిటిషనర్ తరపు అడ్వకేట్ వాదనలు వినిపించారు. ఆ ప్రక్రియ కొనసాగుతోందని ఏఏజీ కోర్టుకు తెలిపారు. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది.

Next Story