- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
credit cards: గమనించారా..? క్రెడిట్ కార్డుల నియమాలు మారుతున్నాయి!
క్రెడిట్ కార్డుల (credit cards) గురించి చాలా మందికి తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: క్రెడిట్ కార్డుల (credit cards) గురించి చాలా మందికి తెలిసిందే. దీన్ని చాలా మంది ఉపయోగిస్తుంటారు. ఎటీఎం(ATM) దగ్గరికెళ్లాలంటే మనీ తీసేందుకు క్రెడిట్ కార్డునే వాడుతారు. క్రెడిట్ కార్డ్ అనేది బ్యాంకు లేదా ఋణ సంస్థ(credit institution) ముందస్తుగా నిర్ధారించిన క్రెడిట్ పరిమితి వరకు ఋణంపై కొనుగోళ్లు చేసేందుకు యూజర్‌కు వీలు కలిగిస్తూ జారీచేసే ఒక ప్లాస్టిక్ కార్డు. క్రెడిట్ కార్డ్ మీ నెలవారీ క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌తో పంపబడిన వివరణాత్మక జాబితాతో కార్డ్ ద్వారా చేసిన ప్రతి కొనుగోలును రికార్డ్ చేస్తుంది. అలాగే మీ ఖర్చుల్ని.. కొనుగోళ్లను గుర్తించడానికి.. ట్రాక్ చేయడానికి క్రెడిట్ కార్డును ఉపయోగిస్తారు. క్రెడిట్ కార్డును బడ్జెట్‌ను ఖర్చు చేసేటప్పుడు లేదా పన్ను ప్రయోజనాల కోసం యూజ్ చేస్తారు.
అయితే ఈ ఏడాది (2025)క్రెడిట్ కార్డుల నియమాలు మారాయి. అనవసరపు ఛార్జీల(Unnecessary charges) బారిన పడకుండా ఈ ఛేంజెస్ చేసినట్లు తెలుస్తోంది. వినియోగదారులు రెస్పాన్సిబిలిటీగా నడుచుకునేందుకు, ఇటీవల జరుగుతోన్న మోసాలను దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు చేయడం జరుగుతుంది. మరీ క్రెడిట్ కార్డులో జరిగిన ఛేంజెస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
యాభై వేల కంటే ఎక్కువ బిల్లులు అండ్ రూ. 15 వేల కంటే ఎక్కువ ఇంధన ట్రాన్సాక్షన్ల(Fuel transactions)పై ఎస్బీఐ క్రెడిట్ కార్డులపై 1 శాతం రుసుము ఉంటుంది. అలాగే యాక్సెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులకు వాలెట్ లోడ్ల(Wallet loads)పై, ఇంధనం(fuel), అద్దెపై ఎడ్జ్ రివార్డుల(Edge Rewards)పై కొత్త రిడంప్షన్ ఫీజులు(New redemption fees), మారిన వడ్డీ రేట్లపై ఛార్జీలు. ఇక ఎస్బీఐ క్రెడిట్ కార్డు(SBI Credit Card)ల్లో మార్పులు చూసుకున్నట్లైతే.. ప్రభుత్వ బిల్లులు, విద్య(education), అద్దె, బీబీపీఎస్(BBPS) పై రివార్డులను తొలగించారు. అలాగే యాభై వేల రూపాయల కంటే ఎక్కువ యుటిలిటీ బిల్లుల(Utility bills)పై ఒక శాతం ఫీజు ఉండనుంది.






