హరీశ్‌రావు మైండ్‌ బ్లాంక్ అయింది.. విప్ ఆది శ్రీనివాస్ హాట్ కామెంట్స్

by Kema Shiva Kumar |

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ (SIT) విచారణ ఎదుర్కొన్న మాజీ మంత్రి హరీష్ రావుపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Adi Srinivas) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

హరీశ్‌రావు మైండ్‌ బ్లాంక్ అయింది.. విప్ ఆది శ్రీనివాస్ హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ (SIT) విచారణ ఎదుర్కొన్న మాజీ మంత్రి హరీష్ రావుపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Adi Srinivas) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇవాళ ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. విచారణ తర్వాత హరీష్ రావు (Harish Rao)లో కనిపిస్తున్న మార్పులను ఎద్దేవా చేశారు. సిట్ అధికారుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక హరీష్ రావు పూర్తిగా గందరగోళంలో ఉన్నారని కామెంట్ చేశారు. విచారణలో అధికారులు అడిగిన ప్రశ్నలకు ఆయన మైండ్ బ్లాంక్ అయ్యిందని అన్నారు.

ట్యాపింగ్ జరిగిందని ఆయన పరోక్షంగా అంగీకరిస్తూనే, తనకు సంబంధం లేదంటూ తప్పించుకోవాలని చూస్తున్నారని ఆది శ్రీనివాస్ విమర్శించారు. బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందనడానికి వేరే ఆధారాలు అక్కర్లేదని, గతంలో ఆ పార్టీలో ఉన్న కవిత స్వయంగా తన ఫోన్ ట్యాప్ అయిందని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇంటి బిడ్డే నిజాన్ని వెల్లడించినప్పుడు, ఇక దాచడానికి ఏముందని ఆయన ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డికి వెన్నుపోటు రాజకీయాలు తెలియవని.. ఎన్నడైనా శత్రువు ముందు నిలబడి నేరుగా పోరాడే ధీశాలి అని కొనియాడారు. బీఆర్ఎస్ నేతల్లాగా దొంగచాటుగా ఫోన్లు ట్యాప్ చేసి రాజకీయాలు చేయాల్సిన అవసరం ఆయనకు లేదని విప్ ఆది శ్రీనివాస్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Next Story