- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డబుల్ ఫన్, డబుల్ యాక్షన్‌తో 'హ్యాపీ బర్త్‌డే' ట్రైలర్
by GSrikanth |
‘మత్తు వదలరా’ మూవీ ఫేమ్ రితేష్ రానా దర్శకత్వంలో హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ‘హ్యాపీ బర్త్‌డే’.

X
దిశ, సినిమా : 'మత్తు వదలరా' మూవీ ఫేమ్ రితేష్ రానా దర్శకత్వంలో హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం 'హ్యాపీ బర్త్‌డే'. ఈ చిత్రం జులై 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే.. తాజాగా నిర్వహించిన గ్రాండ్ ఈవెంట్‌లో ఈ సినిమా ట్రైలర్‌ను దర్శక ధీరుడు రాజమౌళి ఆవిష్కరించారు. ట్రెలర్‌లో కనిపించిన ప్రతీ ఒక్కరి చేతిలో తుపాకీ ఉండగా.. కాన్సెప్ట్ చాలా క్రేజీగా ఉంది. ఇక ఈ చిత్రంలో నరేష్ అగస్త్య, సప్తగిరి, సత్య, వెన్నెల కిషోర్, గుండు సుదర్శన్ తదితరులు నటిస్తున్నారు. కాగా 'మత్తు వదలరా'తో పోల్చితే డబుల్ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం డబుల్ ఫన్‌తో పాటు డబుల్ యాక్షన్‌ను అందిస్తుందని దర్శకుడు చెప్పారు. అయితే ట్రైలర్‌లో ఆ తుపాకులేంటి? బర్త్‌డే పార్టీకి, ఈ కథకు సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే మూవీ రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.
Next Story






