WPL.. ముంబయిపై గుజరాత్ విజయం

by Muthe.Rajitha |

WPL 2026 సీజన్లో భాగంగా నేడు జరిగిన మ్యాచులో ముంబయి పై గుజరాత్ విజయం సాధించింది.

WPL.. ముంబయిపై గుజరాత్ విజయం
X

దిశ, వెబ్ డెస్క్ : WPL 2026 సీజన్లో భాగంగా నేడు జరిగిన మ్యాచులో ముంబయి ఇండియన్స్ పై గుజరాత్ జెయింట్స్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో గుజరాత్ ఫైనల్ కు చేరుకుంది. టాస్ గెలిచిన గుజరాత్ ముందుగా బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 167 పరుగులు చేసింది. జట్టులో ఆష్లీ గార్డ్‌నర్ 46, జార్జియా వేర్‌హమ్ నాటౌట్‌గా 44, అనుష్క శర్మ 33, సోఫీ డివైన్ 25 పరుగులు చేసి జట్టుకు మంచి స్కోర్ అందించారు. ముంబై బౌలర్లలో అమెలియా కెర్ 2 వికెట్లు తీసుకోగా, షబ్నిమ్ ఇస్మాయిల్ మరియు నట్ సివర్ బ్రంట్ తలో వికెట్ తీశారు.

అనంతరం బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 156 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుతంగా 82 పరుగులు నాటౌట్‌గా చేసినా జట్టును గెలిపించలేకపోయింది. గుజరాత్ బౌలింగ్‌లో సోఫీ డివైన్, జార్జియా వేర్‌హమ్ చెరో రెండు వికెట్లు తీయగా, కష్వీ గౌతమ్, రాజేశ్వరి గైక్వాడ్, ఆష్లీ గార్డ్‌నర్ తలో వికెట్ తీసుకున్నారు. ఇప్పుడు RCB, ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్ జట్లు ఫైనల్ రేస్‌లో ఉండటంతో టోర్నమెంట్ మరింత ఆసక్తికరంగా మారింది.

Next Story