- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరోసారి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెదిరింపులు
గోషామహల్ ఎమ్మెల్యే టి. రాజాసింగ్‌కు గుర్తుతెలియని వ్యక్తి నుంచి ప్రాణహాని తలపెడుతూ వచ్చిన బెదిరింపు లేఖ స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

దిశ, వెబ్‌డెస్క్: గోషామహల్ ఎమ్మెల్యే టి రాజాసింగ్ (Raja Singh)కు గుర్తుతెలియని వ్యక్తి నుంచి ప్రాణహాని తలపెడుతూ వచ్చిన బెదిరింపు లేఖ (Threatening letter) స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి ఈ లేఖ అందినట్లు సమాచారం. అబ్దుల్ హఫీజ్ అనే వ్యక్తి పేరుతో ఉన్న ఈ లేఖలో ఎమ్మెల్యేను ఉద్దేశించి తీవ్రస్థాయిలో హెచ్చరికలు చేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేకు బెదిరింపులు జారీ చేస్తూ వచ్చిన లేఖలోని అంశాలు అత్యంత వివాదాస్పదంగా ఉన్నాయి.
పోలీసులు తనను ఏమీ చేయలేరని, తనకు ఎలాంటి హాని తలపెట్టలేరని సదరు వ్యక్తి లేఖలో సవాల్ విసిరినట్లు సమాచారం. గతంలో కూడా రాజాసింగ్‌కు పలుమార్లు విదేశాల నుండి, స్థానికంగా ఫోన్ కాల్స్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. కానీ ఈ సారి నేరుగా ఎమ్మెల్యే నివాసానికే లేఖ రావడం భద్రతా పరంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై రాజాసింగ్ అనుచరులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ లేఖ ఎక్కడి నుంచి వచ్చింది? పంపిన వ్యక్తి ఎవరు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించే అవకాశం ఉంది.






