Google Play Store: నాలుగు యాప్స్‌ను తొలగించిన గూగుల్.. అది ఉన్నట్లు గమనించి..

by Dishafeatures2 |
Google Has Removed Four Apps From Play Store
X

దిశ, వెబ్‌డెస్క్: Google Has Removed Four Apps From Play Store| స్మార్ట్ ఫోన్ వినియోగించే ప్రతి ఒక్కరికీ గూగుల్ ప్లేస్టోర్ అంటే ఏంటో తెలుసు. వారు ఏ యాప్‌నైనా సెక్యూర్‌గా డౌన్‌లోడ్ చేయాలంటే దీని నుంచే చేసుకోవాలి. గూగుల్ ప్లేస్టోర్‌లో లక్షల కొద్దీ అప్లికేషన్‌లు ఉంటాయి. వాటిలో ప్రతి ఒక్క యాప్‌ను గూగుల్ సాఫ్ట్ వేర్ ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటుంది. తన వినియోగదారుల డిజిటల్ సెక్యూరిటీకి గూగుల్ పెద్దపీట వేస్తుంది. అయితే తాజాగా గూగుల్ తన ప్లేస్టోర్ నుంచి నాలుగు యాప్‌లను తొలగించింది. ఆ నాలుగు అప్లికేషన్‌లలో 'జోకర్' అనే మాల్వేర్‌ ఉన్నట్లు గూగుల్ గమనించింది. దాంతో గూగుల్ వీటిని తన ప్లేస్టోర్ నుంచి తొలగించింది. అయితే సైచల్ సెక్యూరిటీ సంస్థ ప్రాడియో ఈ నాలుగు అప్లికేషన్‌లలో జోకర్ మార్వేర్ ఉందని, వీటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు చేసింది. దాంతో వెంటనే స్పందించిన గూగుల్ వాటిని తీసేసింది. అంతేకాకుండా ఈ యాప్‌ల ద్వారా సైబర్ మోసాలు చేయొచ్చని, ఇన్-యాప్ కొనుగోళ్లు, కాల్స్, మెసెజెస్ వంటి ద్వారా మోసాలు చేసేందుకు అనేక అవకాశాలు ఉన్నాయని ప్రాడియో వెల్లడించింది. ఆ నాలుగు అప్లికేషన్‌లు Smart SMS messages, Blood pressure monitor, Voice Languages Translator, Quick Text SMS. ప్రాడియో హెచ్చరికల మేరకు గూగుల్ ఈ నిర్ణయం తీసుకుంది. వీటిని ఇప్పటికే ఉపయోగిస్తున్న ప్రతిఒక్కరూ వీటిని డిలీట్ చేయాలని గూగుల్ కోరింది.

Also Read: ఊహించని విశ్వం.. ఫొటో షేర్ చేసిన నాసా..

Next Story