- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజధాని రైతులకు ఆర్థిక భరోసా.. ఎకరాకు రూ. 10 వేల కౌలు పెంపు
అమరావతి రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త! వార్షిక కౌలు మొత్తాన్ని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. మెట్ట, జరీబు భూములకు కౌలు పెంపుతో పాటు ఏటా రూ. 3 వేల పెరుగుదల అమలు

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. రాజధాని రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తూ.. కౌలును భారీగా పెంచింది. రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం వార్షిక కౌలు మొత్తాన్ని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఎకరం మెట్ట భూమికి ఏడాదికి రూ. 30,000 కౌలు ఉండగా, ప్రభుత్వం దానిని రూ. 40,000 కు పెంచింది. జరీబు భూములకు ఇచ్చే వార్షిక కౌలును రూ. 50,000 నుంచి రూ. 60,000 లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అలాగే రైతులకు దీర్ఘకాలిక ఆర్థిక భరోసా కల్పించే ఉద్దేశంతో, ఏటా ఈ కౌలు మొత్తాన్ని రూ. 3,000 చొప్పున పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా రెండో విడత భూసమీకరణకు అంగీకరించిన రైతులకు కూడా ఈ పెంపు వర్తించనుండటంతో అమరావతి ప్రాంత రైతుల నుండి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.






