- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, చౌట్కూర్: సంగారెడ్డి జిల్లా చౌట్కూర్ మండల పరిధిలోని కోర్పోల్ గ్రామంలో గత రెండు రోజులుగా వింత వ్యాధితో మేకలు, గొర్రెలు చనిపోతున్నాయి. ఈ విషయాన్ని పశువుల వైద్య అధికారులకు తెలిపినప్పటికి ఇప్పటివరకు రాకపోవడం గమనార్హం. ఫోన్ చేస్తే బిజీగా ఉన్నామని నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు. పశువైద్యాధికారుల నిర్లక్ష్యంతో ఇప్పటివరకు గ్రామానికి చెందిన పొట్టి సత్యనారాయణ కు చెందిన 7 మేకలు, జగ్గంపేట చెన్నయ్య కి చెందిన 4 గొర్రెలు మృతి చెందడం జరిగింది. అధికారులు ఇలాగే వ్యవహరిస్తే ఇంకా మేకలు, గొర్రెలు మృత్యువాత పడే అవకాశం లేకపోలేదని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన పశువైద్యాధికారులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమను ఆదుకోవాలని మేకలు, గొర్రెల యజమానులు కోరుతున్నారు.
Next Story






