- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Viral Video: ఒళ్లు జలదరించే కిడ్నాప్ సీన్..! (వీడియో)
కిడ్నాప్‌లు ఎలా జరుగుతాయో చాలా మందికి తెలియదు. Girl Was a Second Away From Getting Kidnapped, Viral Video.

దిశ, వెబ్‌డెస్క్ః సాధారణంగా కిడ్నాప్‌లు నిర్మానుష ప్రదేశాల్లోనో, ఎలాంటి ఆధారాలు దొరకకుండానో ఎక్కువగా జరుగుతుంటాయి. అందుకే, కిడ్నాప్‌లు ఎలా జరుగుతాయో చాలా మందికి తెలియదు. అయితే, ఈ వీడియో మాత్రం చాలా స్పష్టంగా కిడ్నాప్‌ను చూపిస్తుంది. అలాగే, కిడ్నాప్ ప్లాన్ ఎలా బెడిసికొట్టిందో కూడా ఇందులో తెలుస్తుంది. ప్రమాదాలు చెప్పి రావు, అలాగే కొన్నిసార్లు సహాయం కూడా చెప్పకుండా వస్తుందని ఈ సంఘటన రుజువు చేస్తుంది.
ఈ వీడియోలో ఓ టీనేజ్ అమ్మాయి ఐస్‌క్రీమ్ కొనుకోడానికి వస్తుంది. అప్పటి వరకూ ఐస్‌క్రీమ్ షాపు పక్కనే నుంచొని ఫోన్లో మాట్లాడుతున్న వ్యక్తి ఆమె షాపు నుండి వెనుదిరిగే టైమ్‌లోనే వెనుక డోర్ తీసున్న తన కారు దగ్గరకు వెళ్లడానికి ప్రత్నిస్తాడు. ఇదంతా గమనిస్తున్న షాపులో మహిళ అతడిపై అనుమానం వచ్చి ఆ అమ్మాయిని కాపాడుతుంది. హఠాత్పరిణామానికి కంగారు పడిన కిడ్నాపర్ ఏంచేయాలో తెలియక వెళ్లిపోతాడు. ఈ వీడియోలో ఉన్నది రియల్ సంఘటనా కావాలని తీసిందో తెలియదు కానీ కిడ్నాప్ ఘటన ఇలా జరుగుతుందా అనిపిస్తుంది. ఈ వీడియోకు మిలియన్ల కొద్దీ వ్యూవ్స్ వస్తున్నాయిప్పుడు.
Lady has seen this all before. pic.twitter.com/thdDScITnT
— Jamie Gnuman197... (@JGnuman197) April 2, 2022
- Tags
- viral video






