- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
1936 నుంచి 234 కు.. నక్సల్ హింసపై హోం శాఖ సంచలన నివేదిక
మంగళవారం లోక్‌సభలో మంత్రి నిత్యానంద రాయ్ సమర్పించిన నివేదిక ప్రకారం, భారతదేశ అంతర్గత భద్రతకు పెనుసవాలుగా మారిన వామపక్ష తీవ్రవాదం (LWE) ఇప్పుడు తన చివరి దశకు చేరుకుంది.

దిశ, వెబ్ డెస్క్: భారత అంతర్గత భద్రతకు సవాలుగా మారిన వామపక్ష తీవ్రవాదం (LWE)పై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆపరేషన్ కగార్ ను ఏర్పాటు చేసిన కేంద్రం.. నక్సలైట్లను ఎక్కడికక్కడ ఏరి పారేస్తుంది. ఇందులో భాగంగా డెడ్ లైన్ విధించిన మరి లొంగిపోవాలని వారికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వందల సంఖ్యలో మావోయిస్టులు వివిధ రాష్ట్రాల్లో పోలీసులకు లొంగిపోయారు.
ఈ పరిణామాలతో ఇప్పుడు వామపక్ష తీవ్రవాదం చివరి దశకు చేరుకుందని మంగళవారం లోక్‌సభలో మంత్రి నిత్యానంద రాయ్ సమర్పించిన నివేదికలో స్పష్టం చేశారు. గత దశాబ్ద కాలంలో నక్సల్స్ హింస అనూహ్యంగా తగ్గిందని, 2010లో గరిష్టంగా 1,936 గా ఉన్న హింసాత్మక సంఘటనలు, 2025 నాటికి 234 కి పడిపోయాయని. అంటే దాదాపు 88 శాతం మేర హింస తగ్గిందని మంత్రి లోక్ సభకు తెలిపారు.
భద్రతా దళాల పైచేయి
తాజా నివేదిక ప్రకారం గతంతో పోలిస్తే.. నక్సల్స్ దాడుల్లో మరణించే పౌరులు, భద్రతా దళాల సంఖ్య కూడా భారీగా తగ్గింది. 2010లో 1,005 మంది ప్రాణాలు కోల్పోగా, 2025లో ఆ సంఖ్య 100 కి (90 శాతం తగ్గింపు) పరిమితమైంది. కేవలం 2025 సంవత్సరంలోనే 364 మంది నక్సలైట్లను భద్రతా దళాలు మట్టుబెట్టాయి అలాగే 1,022 మందిని అరెస్టు చేశారు. ప్రభుత్వ పిలుపు మేరకు 2,337 మంది నక్సల్స్ జనజీవన స్రవంతి లోకి వచ్చి లొంగిపోయారు. అలాగే హింస నివేదించబడే పోలీస్ స్టేషన్ ల సంఖ్య కూడా 465 నుండి 119 కి తగ్గడం గమనార్హం.
కొత్తగా 'లెగసీ అండ్ థ్రస్ట్' జిల్లాల గుర్తింపు
వామపక్ష తీవ్రవాద ప్రభావం తగ్గుతున్న కొద్దీ, ఆయా ప్రాంతాల్లో అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. దీని కోసం 2024లో 'లెగసీ అండ్ థ్రస్ట్' అనే కొత్త కేటగిరీని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఈ విభాగంలో 30 జిల్లాలు ఉన్నాయి. ఇవి ప్రస్తుతం ఎల్‌డబ్ల్యూఈ (LWE) ప్రభావిత జిల్లాలు కానప్పటికీ, తీవ్రవాదం మళ్ళీ తలెత్తకుండా చూడటం, సామాజిక-ఆర్థిక మార్పును తీసుకురావడమే ఈ పథకం ఉద్దేశం. ఈ జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి మౌలిక సదుపాయాల కల్పన కోసం నిరంతరం మద్దతు అందుతుంది.
2026 నాటికి నక్సల్-ఫ్రీ ఇండియా!
భారత కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిర్దేశించిన లక్ష్యం ప్రకారం.. మార్చి 2026 నాటికి దేశాన్ని నక్సలిజం నుంచి పూర్తిగా విముక్తి చేయాలని ప్రభుత్వం కంకణం కట్టుకుంది. దీని కోసం భద్రతా చర్యలతో పాటు, గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం, టెలికాం కనెక్టివిటీ, విద్య, వైద్య సదుపాయాల కల్పన వంటి అభివృద్ధి పనులను ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చేపడుతోందని లోక్‌సభలో మంత్రి నిత్యానంద రాయ్ సమర్పించిన నివేదికలో తెలిపారు.






