కేంద్రం కీలక నిర్ణయం.. మరో ఆరు నెలలు ఉచిత రేషన్

by Disha Web |
కేంద్రం కీలక నిర్ణయం.. మరో ఆరు నెలలు ఉచిత రేషన్
X

న్యూఢిల్లీ: రేషన్ పంపిణీలో ప్రధాని మోడీ కీలక ప్రకటన చేశారు. ఉచిత రేషన్ పంపిణీ పథకాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగిస్తున్నట్లు శనివారం ప్రకటించారు. క్యాబినెట్ సమావేశం తర్వాత ప్రకటన విడుదల చేశారు. 'పేదలు, అణగారిన వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకుని క్యాబినెట్ ఉచిత రేషన్ పథకాన్ని పెంచుతున్నట్లు నిర్ణయించింది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనా పథకాన్ని సెప్టెంబర్ వరకు పొడగిస్తున్నాం' అని ప్రకటనలో పేర్కొంది. ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ 5 కేజీల ధాన్యాన్ని ఉచితంగా కేంద్రం అందిస్తుంది. ఈ పథకం ద్వారా 80 కోట్ల లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుతుండగా, కేంద్ర ప్రభుత్వంపై రూ.80వేల కోట్ల అదనపు భారం పడనుంది. 'ఇప్పటికే ప్రభుత్వం రూ.2.60 కోట్లు ఈ పథకంపై వెచ్చించింది. అదనంగా మరో రూ.80వేల కోట్ల వచ్చే ఆరు నెలలకు గాను ఖర్చు చేయనుంది' అని మరో ప్రకటనలో తెలిపింది. ఈ పొడిగింపు మోడీ ప్రభుత్వానికి పేదల పట్ల ఉన్న సున్నితత్వాన్ని తెలియజేస్తుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ట్వీట్ చేశారు.



Next Story

Most Viewed