Phone Tapping Case: కొనసాగుతున్న సంతోష్‌రావు విచారణ

by Gantepaka Srikanth |   (  Updated:2026-01-27 16:45:00  IST  )

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మాజీ ఎంపీ సంతోష్‌రావు విచారణ కొనసాగుతోంది.

Phone Tapping Case: కొనసాగుతున్న సంతోష్‌రావు విచారణ
X

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మాజీ ఎంపీ సంతోష్‌రావు విచారణ కొనసాగుతోంది. ఆరు గంటలుగా సంతోష్‌రావును సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా ప్రభాకర్‌రావు నియామకంపై నిర్ణయం ఎవరిదంటూ సంతోష్ రావును సిట్ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. ఫోన్‌ ట్యాపింగ్‌కు సంబంధించి కొన్ని ఆధారాలు ముందు పెట్టి ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. సంతోష్‌రావు స్టేట్‌మెంట్‌ను సిట్‌ అధికారులు రికార్డ్‌ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కోసమే రిటైర్డ్ అయిన తరువాత కూడా ఎస్‌ఐబీ చీఫ్, ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ప్రభాకర్ రావును ప్రభుత్వం కొనసాగించినట్లు సిట్ అనుమానిస్తోంది. ఈ బాధ్యతలు అప్పగించడంలో నిర్ణయం, ఆదేశాలు ఎవరిచ్చారనే దానిపై సంతోష్ రావును సిట్ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్‌లో ఆయన కొన్ని నంబర్లను ఎస్‌ఐబీకి ఇచ్చి ట్యాప్ చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏ నంబర్ ట్యాప్ చేయాలో సంతోష్ రావు నుంచి ఆదేశాలు అందినట్లు సిట్ ఆధారాలు సేకరించింది.

Next Story