- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ బీజేపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే
మున్సిపల్ ఎన్నికల బీజేపీ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేత, మాజీ వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ రాజీనామా చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: మున్సిపల్ ఎన్నికల బీజేపీ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేత, మాజీ వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ రాజీనామా చేశారు. త్వరలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ‘భారతీయ జనతా పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. నాకు ఇన్ని రోజులు సహకరించిన బీజేపీ పెద్దలకు, నాయకులకు, కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు. భారత రాష్ట్ర సమితి అధిష్టానం ఆహ్వానం మేరకు నా ఇంటి పార్టీ బీఆర్ఎస్‌లోకి త్వరలో పలువురు నాయకులు, నా అనుచరులు, అభిమానులతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో భారీ ఎత్తున చేరాలని నిర్ణయించుకున్నాను’ అని ప్రకటనలో అరూరి రమేష్ పేర్కొన్నారు.
Next Story






