- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM బావమరిది మేలు కోసమే సైట్ విజిట్: కొప్పుల ఈశ్వర్
సింగరేణిలో జరుగుతున్న బొగ్గు బ్లాక్‌ల కుంభకోణంపై రాష్ట్రంలో చర్చ జరుగుతున్నదని.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సింగరేణి కుంభకోణాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్ అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: సింగరేణిలో జరుగుతున్న బొగ్గు బ్లాక్‌ల కుంభకోణంపై రాష్ట్రంలో చర్చ జరుగుతున్నదని.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సింగరేణి కుంభకోణాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్ అన్నారు. గురువారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ కుంభకోణంపై హరీశ్‌రావు ఆధారాలతో బయటపెట్టడంతో నైని టెండర్లు రద్దు చేశారని.. మిగతా బ్లాక్‌ల టెండర్ల పరిస్థితి ఏంటని నిలదీశారు. సింగరేణి అంటే ఒక్క బొగ్గు బ్లాక్ కాదని.. అనేక మంది కుటుంబ సభ్యుల భవిష్యత్తు అని చెప్పారు. రేవంత్ ప్రభుత్వం ఇందులో రూ.6వేల కోట్ల కుంభకోణం చేసినట్లు తెలుస్తున్నదని అన్నారు. స్వయాన సీఎం బావమరిది ప్రసన్నం చేసుకోవడం కోసమే ఈ కుంభకోణం అని తెలుస్తున్నదన్నారు. బొగ్గు కుంభకోణం బయట పెడితే హరీశ్‌రావును 7 గంటలకు పైగా విచారణ చేపట్టి ఇబ్బంది పెట్టారన్నారు. కుంభకోణంపై కాంగ్రెస్ పార్టీ నేతలు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. కేంద్రంలో మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి, సంజయ్ ఇద్దరు కూడా స్పందించడం లేదన్నారు.
రాష్ట్రానికి ఏం మేలు చేస్తున్నారు?
అవినీతి జరిగింది సీఎం బావమరిది కాబట్టి విచారణకు సీఎం కోరుతారా అని అన్నారు. సైట్ విజిట్ సర్టిఫికేషన్ అనేది సీఎం బావమరిది మేలు కొరకే పెట్టారని ఆరోపించారు. ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి రాష్ట్రానికి ఏం మేలు చేస్తున్నారని నిలదీశారు. తాము ఆరోపణలు చేయడం లేదని.. ఆధారాలతో బయట పెట్టామన్నారు. సీబీఐ విచారణకు ఆదేశిస్తే అన్ని ఆధారాలు ఇస్తామని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ కబంధ హస్తాల నుండి సింగరేణిని కాపాడడం కోసం పోరాటం చేస్తామన్నారు. సింగరేణిని దోచుకుంటామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. టీబీజీకేఎస్ అధ్యక్షుడు రాజిరెడ్డి మాట్లాడుతూ.. సేవ్ సింగరేణి.. బచావో సింగరేణి పేరు మీద నిన్న నిరసనలు వ్యక్తం చేశామన్నారు. రూ.55వేల కోట్లు విద్యుత్ డిస్కంల నుండి రావాల్సిన అవసరం ఉన్నదన్నారు. దాదాపు 4వేల కోట్ల వడ్డీ సింగరేణి కోల్పోతున్నదన్నారు. ప్రభుత్వ పనులకు సింగరేణి సంస్థ డబ్బులు వాడుకుంటున్నదని.. మెస్సీ వస్తే సైతం సింగరేణి సంస్థ డబ్బులనే వాడారని ఆరోపించారు.






