హైదరాబాద్‌లో మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ సందడి

by Gantepaka Srikanth |

భారత మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ను బిగ్‌ అకాడమీ తమ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ప్రకటించింది.

హైదరాబాద్‌లో మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ సందడి
X

దిశ, వెబ్‌డెస్క్: భారత మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌(Yuvraj Singh)ను బిగ్‌ అకాడమీ తమ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ప్రకటించింది. ఆయన విజయవంతమైన ప్రయాణం అకాడమీ విశ్వసించే క్రమశిక్షణ, పట్టుదల ఏకాగ్రతల సమ్మేళనంతో సరిపోల్చదగినదిగా పేర్కొంది. హైదరాబాద్‌ నగరంలోని నోవోటెల్‌ హెచ్‌ఐసీసీలో జరిగిన కార్యక్రమంలో భారత క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌, నటుడు బ్రహ్మానందం, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సీవీ ఆనంద్, బిగ్‌ టీవీ వ్యవస్థాపకుడు ఛైర్మన్‌ విజయ్‌ రెడ్డి, బిగ్‌ టీవీ మలయాళం వ్యవస్థాపక డైరెక్టర్‌ మేనేజింగ్‌ ఎడిటర్‌ అనిల్‌ ఆయూర్‌‌లతో కలిసి బిగ్‌ అకాడమీని ప్రారభించారు. ఈ సందర్భంగా స్టార్ క్రికెటర్ యువరాజ్‌ సింగ్‌ మీడియాతో మాట్లాడుతూ.. భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న విద్యా వ్యవస్థలో ఆవిష్కరణ జవాబుదారీతనాల ప్రాముఖ్యతను ప్రధానంగా ప్రస్తావించారు.




Next Story