ఇంగ్లీష్ బ్యాటర్లకు కుల్దీప్ అంటేనే వణుకు.. సెమీఫైనల్ కోసం టీమిండియాకు మాజీ కెప్టెన్ మాస్టర్ ప్లాన్!

by Malleboina Mahesh |

ఇంగ్లాండ్‌పై కుల్దీప్ యాదవ్‌కు అద్భుతమైన రికార్డు ఉందని, సెమీఫైనల్‌లో అతడిని తుది జట్టులోకి తీసుకోవాలని మైఖేల్ వాన్ టీమిండియాకు సూచించారు.

ఇంగ్లీష్ బ్యాటర్లకు కుల్దీప్ అంటేనే వణుకు.. సెమీఫైనల్ కోసం టీమిండియాకు మాజీ కెప్టెన్ మాస్టర్ ప్లాన్!
X

దిశ, వెబ్ డెస్క్: ఈ రోజు రాత్రి 7 గంటలకు టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో భాగంగా భారత జట్టు ఇంగ్లాండ్‌తో తలపడనుంది. ఈ క్రమంలో భారత జట్టుకు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ ఒక కీలక సూచనలు చేశారు. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇంగ్లీష్ బ్యాటర్లపై కుల్దీప్‌కు ఉన్న అద్భుతమైన రికార్డు దృష్ట్యా, అతడు భారత్‌కు ఒక బలమైన వ్యూహాత్మక ఆయుధమవుతాడని వాన్ విశ్లేషించారు.

అలాగే భారత్ ఈ టోర్నీలో ఇప్పటివరకు వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్‌లనే ప్రధాన స్పిన్నర్లుగా వాడుతూ ఒకే విధమైన బౌలింగ్ కలయికతో వెళ్తోందని.. వాషింగ్టన్ సుందర్‌ను గ్రూప్ దశలో ప్రయత్నించినప్పటికీ, కుల్దీప్‌కు మాత్రం పెద్దగా అవకాశాలు దక్కలేదని గుర్తు చేశాడు. ఈ టోర్నీలో కుల్దీప్ కేవలం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రమే ఆడి, 14 పరుగులిచ్చి 1 వికెట్ తీసి ఆకట్టుకున్నాడని. జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్‌లకు స్పిన్నర్ల నుంచి తగిన సహకారం అందుతోందని ఈ సందర్భంగా వాన్ పేర్కొన్నారు.

కుల్దీప్ యాదవ్‌‌నే ఎందుకు తీసుకొవాలి..?

ఇంగ్లాండ్ జట్టుపై కుల్దీప్ యాదవ్‌కు తిరుగులేని రికార్డు ఉందని వాన్ గుర్తు చేశారు. వన్డే, టీ20, టెస్టు ఇలా ఏ ఫార్మాట్‌లోనైనా ఇంగ్లాండ్ బ్యాటర్లు కుల్దీప్ బౌలింగ్‌ను సరిగ్గా అంచనా వేయలేక ఇబ్బంది పడతారు. జట్టులో తిలక్ వర్మ, శివం దూబే వంటి బ్యాటర్ల కంటే, ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బకొట్టడానికి ఎడమచేతి వాటం లెగ్ స్పిన్నర్ కుల్దీప్ అవసరం ఎంతైనా ఉంది" అని వాన్ వివరించారు. గణాంకాల ప్రకారం ఇంగ్లాండ్‌పై ఆడిన టీ20ల్లో కుల్దీప్ 12 ఓవర్లు వేసి కేవలం 77 పరుగులు మాత్రమే ఇచ్చి 8 వికెట్లు పడగొట్టారని గుర్తు చేశారు

అయితే టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సాధారణంగా బ్యాటింగ్ లైనప్‌ను బలోపేతం చేయడానికే మొగ్గు చూపుతారని వాన్ అభిప్రాయపడ్డారు. 7, 8, 9 స్థానాల్లో కూడా పవర్‌ఫుల్ బ్యాటింగ్ ఉండేలా గంభీర్ జట్టును సిద్ధం చేస్తారని, అందుకే కుల్దీప్ ఎంపికపై సందిగ్ధత ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు. అయినప్పటికీ, సెమీఫైనల్ వంటి కీలక మ్యాచ్‌లో కుల్దీప్ వంటి స్పెషలిస్ట్ స్పిన్నర్ ఉండటం భారత్‌కు లాభిస్తుందని వాన్ గట్టిగా సూచించారు.

Next Story