- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రాక్టర్-ట్రాలీని ఢీకొన్న కారు నలుగురు స్నేహితుల మృతి!
మొరాదాబాద్ ముంధపాండే వద్ద ఘోర ప్రమాదం. ట్రాక్టర్-ట్రాలీని ఢీకొట్టిన అతివేగ కారు.. నలుగురు మృతి. సంతాపం వ్యక్తం చేసిన సీఎం యోగి.

దిశ, వెబ్ డెస్క్: వేగంగా వెళ్తున్న కారు.. ట్రాక్టర్ ట్రాలీని ఢీకొనడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ముంధపాండే పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్నో-ఢిల్లీ హైవేపై ఇటుకల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్-ట్రాలీని ఒక అతి వేగంగా వచ్చిన కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమవ్వగా, అందులో ప్రయాణిస్తున్న నలుగురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా మొరాదాబాద్ నివాసితులని, తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఢిల్లీకి వెళ్తుండగా మంకరా మలుపు వద్ద ఈ దుర్ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు.
కాగా ఈ హృదయ విదారక ఘటనపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంతాపం వ్యక్తం చేశారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి, సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. గాయపడిన వ్యక్తికి మెరుగైన చికిత్స అందించాలని, బాధితుల కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉండాలని అధికారులను కోరారు. క్రేన్ సహాయంతో ధ్వంసమైన కారును రోడ్డుపై నుంచి తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.






