కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

by Malleboina Mahesh |

కాకినాడ కొవ్వూరు బ్రిడ్జి వద్ద ఘోర ప్రమాదం జరిగింది. కూలీల ఆటోను టిప్పర్ ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరి పరిస్థితి విషమం.

కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం (Serious road accident) చోటు చేసుకొని నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ సంఘటన శనివారం తెల్లవారుజామున కాకినాడ సమీపంలోని కొవ్వూరు బ్రిడ్జి దగ్గర చోటు చేసుకుంది. ఉపాధి హామీ (Employment Guaranteed Workers) పనులకు వెళ్తున్న కూలీల ఆటోను వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొనడంతో నలుగురు కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులకు స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని, మృతులు సత్యవతి, కృష్ణవేణి, చిట్టెమ్మ, అన్నవరంగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అలాగే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారులు స్పష్టం చేశారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story