- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంటర్ వాల్యుయేషన్ లీలలు... ముందు 5 మార్కులు, రీ వాల్యుయేషన్ పెడితే 60 కి 60
ఏపీ ఇంటర్మీడియేట్ బోర్డు నిర్లక్ష్యం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోంది.

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు అధికారుల అజాగ్రత్త ఒక విద్యార్థిని భవిష్యత్తును ప్రమాదంలో పడేయడమే కాకుండా, ఆమెను తీవ్ర మానసిక ఆందోళనకు గురిచేసింది. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరుకు చెందిన కర్లపూడి కావ్య అనే విద్యార్థిని అన్ని సబ్జెక్టుల్లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచినప్పటికీ, బోటనీలో మాత్రం కేవలం 5 మార్కులే వచ్చినట్లు ఫలితాల్లో చూపించారు. ఈ అనూహ్య ఫలితంతో దిగ్భ్రాంతికి లోనైన కావ్య తీవ్ర ఒత్తిడికి లోనవ్వగా, ఆమె తల్లిదండ్రులు ధైర్యం చెప్పి రీవాల్యూయేషన్‌కు దరఖాస్తు చేయడంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది.
రీవాల్యూయేషన్ అనంతరం అందిన సమాధాన పత్రాలను పరిశీలించగా, కావ్యకు బోటనీలో 60కి 60 మార్కులు వచ్చినట్లు స్పష్టమైంది. సమాధాన పత్రంలోని ప్రతి ప్రశ్నకూ పూర్తి మార్కులు కేటాయించినప్పటికీ, ఆ మార్కులను కంప్యూటర్‌లో నమోదు చేసే సమయంలో జరిగిన ఘోర తప్పిదం వల్లే ఆమె ఫెయిల్ అయినట్లు మార్కుల జాబితాలో నమోదైంది. ఈ ఘటనపై విద్యార్థిని తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటే దానికి బాధ్యులు ఎవరని వారు ప్రశ్నిస్తున్నారు. స్టేట్ టాపర్‌గా నిలవాల్సిన విద్యార్థినిని ఫెయిల్ అని ప్రకటించడం బోర్డు పనితీరులోని లోపాలను ఎత్తిచూపుతోంది.






