4 రాష్ట్రాలకు మోగిన ఎన్నికల నగారా

by Muthe.Rajitha |   (  Updated:2026-03-15 11:52:00  IST  )

దేశంలో నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అయింది.

4 రాష్ట్రాలకు మోగిన ఎన్నికల నగారా
X

దిశ, వెబ్ డెస్క్ : దేశంలో నాలుగు రాష్ట్రాలతోపాటు ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు (Assembly Elections) నగారా మోగింది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌, కేరళ, అస్సాంతోపాటు పుదుచ్చేరి రాష్ట్రాల శాసనసభల పదవీకాలం మే, జూన్‌లలో వేర్వేరు తేదీల్లో ముగియనుంది. దీంతో ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది కేంద్ర ఎన్నికల కమిషన్. అస్సాం, కేరళ, పుదుచ్చేరిలలో ఏప్రిల్ 9న, తమిళనాడులో ఏప్రిల్ 23న, వెస్ట్ బెంగాల్ లో ఏప్రిల్ 23, 29న ఎన్నికలు జరగనుండగా.. వీటన్నిటి ఫలితాలు మే 4న విడుదల కానున్నాయని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (CEC) జ్ఞానేశ్‌కుమార్‌, కమిషనర్లు సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధూ, వివేక్‌ జోషీలు వివరాలు వెల్లడించారు. కాగా ఆయా రాష్ట్రాల్లో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి రానున్నట్టు పేర్కొన్నారు. మొత్తం 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిట ప్రాంతంలో కలిపి 17.4 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్టు తెలిపారు.

Next Story