విద్యుత్ షాక్‌తో వృద్ధుడు మృతి

by Batti.Sumithra |

మండల పరిధిలోని ర్యాలపల్లి గ్రామంలో ఆదివారం సాయంత్రం సంభవించిన ఘోర ప్రమాదంలో విద్యుత్ షాక్ తగిలి ఒక వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

విద్యుత్ షాక్‌తో వృద్ధుడు మృతి
X

దిశ, గంగాధర : మండల పరిధిలోని ర్యాలపల్లి గ్రామంలో ఆదివారం సాయంత్రం సంభవించిన ఘోర ప్రమాదంలో విద్యుత్ షాక్ తగిలి ఒక వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం ర్యాలపల్లి గ్రామానికి చెందిన ఆరేపల్లి హన్మయ్య (80) అనే వృద్ధుడు ఆదివారం సాయంత్రం తన ఎక్స్‌ఎల్ (XL) మోటార్ సైకిల్‌ పై రోడ్డుపై వెళ్తున్నాడు. అదే సమయంలో ఒక్కసారిగా వచ్చిన బలమైన గాలి దుమారం, వర్షం కారణంగా రోడ్డు పక్కన ఉన్న ఒక విద్యుత్ స్తంభం (పోల్) ఒక్కసారిగా కిందపడిపోయింది. ఈ క్రమంలో బైక్‌ పై వెళ్తున్న హన్మయ్య అదుపుతప్పి కిందపడిపోగా, కిందపడిన విద్యుత్ స్తంభానికి ఉన్న లైవ్ కరెంటు వైర్లు ఆయనకు బలంగా తగిలాయి. దీంతో విద్యుత్ షాక్‌కు గురైన హన్మయ్య అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఈ విషాదకర సంఘటన పై మృతుని కుమారుడు బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గంగాధర పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు ఎస్సై వంశీకృష్ణ తెలిపారు. ఈ ప్రమాదం పై కేసునమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఆయన వెల్లడించారు. హన్మయ్య మృతితో ర్యాలపల్లి గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.

Next Story