- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డ్రగ్స్ ఫ్యాక్టరీపై డీఆర్‌ఐ దాడి.. రూ.55 కోట్లు విలువైన మెఫెడ్రోన్ సీజ్
మహారాష్ట్రలోని సతారా జిల్లాలో సాగుతున్న భారీ డ్రగ్స్ దందాను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు సక్సెస్‌ఫుల్‌గా ఛేదించారు.

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర (Maharashtra)లోని సతారా (Satara) జిల్లాలో సాగుతున్న భారీ డ్రగ్స్ దందాను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు సక్సెస్‌ఫుల్‌గా ఛేదించారు. ఆపరేషన్ సహ్యాద్రి చెక్‌మేట్ (Operation Sahyadri Checkmate) పేరుతో చేపట్టిన ఈ మెరుపు దాడిలో ఒక రహస్య డ్రగ్ ఫ్యాక్టరీని గుర్తించి, భారీ మొత్తంలో మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. డ్రగ్స్ తయారీ, సరఫరా జరుగుతోందన్న పక్కా సమాచారంతో DRI అధికారులు శుక్రవారం సతారాలోని ఒక పారిశ్రామిక ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా ఒక ఫ్యాక్టరీలో అక్రమంగా మెఫెడ్రోన్ (Mephedrone) తయారు చేస్తున్నట్లుగా గుర్తించారు. పట్టబడిన సరుకు విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో సుమారు రూ.55 కోట్ల విలువ ఉంటుందని డీఆర్ఐ అధికారులు పేర్కొన్నారు. ఈ డ్రగ్స్‌ను ముంబయి, పుణె వంటి ప్రధాన నగరాలకు సరఫరా చేసేందుకు నిందితులు పక్కా స్కెచ్ వేసినట్లుగా తెలుస్తోంది. ఈ దాడిలో డ్రగ్స్ తయారీకి ఉపయోగించే ముడి పదార్థాలు, అత్యాధునిక యంత్రాలను కూడా డీఆర్ఐ అధికారులు సీజ్ చేశారు. ఫ్యాక్టరీ నిర్వాహకులను అదుపులోకి తీసుకున్న అధికారులు, ఈ ముఠా వెనుక ఉన్న సూత్రధారులు ఎవరనే కోణంలో విచారణ చేపడుతున్నారు.






