తెలంగాణ వచ్చాక నాటకరంగం అభివ‌ద్ధి చెందింది: మంత్రి శ్రీనివాస్ గౌడ్

by Disha Web |
తెలంగాణ వచ్చాక నాటకరంగం అభివ‌ద్ధి చెందింది: మంత్రి శ్రీనివాస్ గౌడ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ రంగస్థల సమాఖ్య (తెర)" సంయుక్తంగా నిర్వహిస్తున్న "తెలంగాణ యువ నాటకోత్సవం-6" ఆదివారం ముగిసింది. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ నాటక బృందాలను అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నాటకం చాలా గొప్పదని, నాటకాన్ని ఫ్యామిలీ మొత్తం కలిసి చూడొచ్చని, తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత తెలంగాణ నాటకరంగం అభివృద్ధి దిశగా పయనిస్తుందని, తెలంగాణ యువ నాటకోత్సవం పేరిట యువకుల ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేస్తున్నామన్నారు.

గత ఐదేళ్ళగా నిర్వహించబడుతున్న యువ నాటకోత్సవం ఐదు సీజన్స్ లో యువ నాటక కళాకారులచే 55 కొత్త నాటికలను ప్రదర్శించి, సీజన్-6లో భాగంగా నాలుగు రోజులపాటు 600మంది కళాకారులతో మరో 10 నాటికలు ప్రదర్శించబడ్డాయని, యువ నాటకోత్సవంను నిర్వహిస్తూ భాషా సాంస్కృతిక శాఖ నుండి ఒక్కో నాటికకు 40వేల రూపాయల ప్రదర్శన పారితోషికం అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed