- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్యాస్ కష్టాలకు చెక్: 44,346 అంగన్‌వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్‌ల పంపిణీ
ఇజ్రాయెల్ vs ఇరాన్ యుద్ధం కారణంగా దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ ప్రభావం అంగన్‌వాడీ కేంద్రాలపై తీవ్రంగా ఉండటంతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: ఇజ్రాయెల్ vs ఇరాన్ యుద్ధం కారణంగా దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత (Gas shortage) ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ ప్రభావం అంగన్‌వాడీ కేంద్రాల (Anganwadi centers)పై తీవ్రంగా ఉండటంతో ఏపీ ప్రభుత్వం (AP Govt) కీలక నిర్ణయం తీసుకుంది. వంట ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్‌వాడీలకు ఇండక్షన్ స్టవ్‌ల (Induction stoves)ను పంపిణీ చేయాలని నిశ్చయించింది. గ్యాస్ కొరత కారణంగా భవిష్యత్తులో చిన్న పిల్లలకు, గర్భిణులకు భోజన తయారీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ చర్యలు చేపట్టింది. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు కింద 11,400 కేంద్రాలకు స్టవ్‌లను అందించగా, అంగన్‌వాడీ కార్యకర్తల నుంచి సానుకూల స్పందన రావడంతో మిగిలిన 44,346 కేంద్రాలకు కూడా వీటిని విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ పథకం కోసం ప్రభుత్వం సుమారు రూ.62 కోట్లు వెచ్చించనుంది. ఒక్కో అంగన్‌వాడీ కేంద్రానికి (Anganwadi centers) ఇండక్షన్ స్టవ్‌తో పాటు దానికి సరిపడే వంట పాత్రలను కలిపి దాదాపు రూ.7 వేల విలువైన కిట్‌ను అందజేస్తారు. మే నెలాఖరు నాటికి మొత్తం నాలుగు విడతల్లో రాష్ట్రంలోని అన్ని కేంద్రాలకు ఈ పరికరాలు అందేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. దీనివల్ల వంట సమయం ఆదా అవ్వడమే కాకుండా, పర్యావరణహితంగా, సురక్షితంగా భోజన సదుపాయం కల్పించడానికి వీలవుతుందని అధికారులు భావిస్తున్నారు.






